Covid19 Cases in India: భారీగా పెరిగిన కరోనా తీవ్రత, 57 వేల కరోనా యాక్టివ్ కేసులు
Covid19 Cases in India: కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తోంది. కోవిడ్ 19 కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 50 వేలు దాటేయడం ఆందోళన కల్గిస్తోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే అంచనా ఉంది.
Covid19 Cases in India: దేశాన్ని, ప్రపంచాన్ని విలవిల్లాడించిన కరోనా వైరస్ మళ్లీ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వరుసగా 3-4 రోజుల్నించి రోజువారీ కేసుల సంఖ్య 10 వేలు దాటుతోంది. జూన్ నాటికి పీక్స్‌కు చేరనుందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో గత 4 రోజుల్లో 40 వేల వరకూ కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాడు 10,747 కొత్త కేసులు నమోదు కాగా, శనివారం నాడు 10,093 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్నించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 19 మంది మరణించారు. వ్యాక్సినేషన్ జరిగినా మరణాలు సంభవిస్తుండటం వైద్యుల్లో ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, హార్ట్ ఎటాక్, బీపీ, ఆస్తమా రోగులు చనిపోతున్నారని తెలుస్తోంది. మరణిస్తున్నవారిలో అధికశాతం పెద్దవయస్సువారే కావడం గమనార్హం.
దేశంలోని మొత్తం కేసుల్లో కరోనా యాక్టివ్ కేసులు 0.13 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 6,248 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 57, 542గా ఉంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకూ 4,42,29,459 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.68 శాతముంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 807 మందికి వ్యాక్సినేషన్ జరిగింది.
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తరచూ రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్ష నిర్వహిస్తోంది. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు అవసరమనే విషయం చర్చిస్తున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కరోనా వైరస్ కేసులు ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. పరీక్షలు పెద్దఎత్తున నిర్వహిస్తే వాస్తవ పరిస్థితి బయటపడుతుంది. కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు ఎంత ఎక్కువ జరిగితే కేసుల సంఖ్య అంతగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం మరో 15 రోజులు కేసుల సంఖ్య ఇలానే పెరగవచ్చు. అయితే ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా వైరస్ అంత తీవ్రమైంది కానందున భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook