కరోనా వైరస్ తీవ్రత భారత్‌లో మరింతగా పెరుగుతోంది. ఓవైపు రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 55వేలకు పైగా కరోనా కేసులను నిర్ధారించారు. ఒక్కరోజే 55,079 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి భారత్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య (CoronaVirus Cases in India) 16,38,871కు చేరింది. Corona Vaccine: రెండు వారాల్లో రష్యా కరోనా వ్యాక్సిన్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 779 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ భారత్‌లో మొత్తం కోవిడ్19 మరణాలు 35,747కు చేరుకున్నాయి. అయితే మొత్తం కేసులకుగానూ 10లక్షలకు పైగా బాధితులు కరోనా మహమ్మారిని జయించడం గమనార్హం. భారత్‌లో చికిత్స అనంతరం 10,57,806 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 5,45,318 యాక్టివ్ కేసులున్నాయి. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే.. 


దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,88,32,970 (1.88 కోట్లు) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 6,42,588 శాంపిల్స్‌ నిన్న ఒక్కరోజే COVID19 టెస్ట్ చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్