భారత్‌లో కోవిడ్19 తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. ఓవైపు రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 54వేలకు పైగా కరోనా కేసులను నిర్ధారించారు. ఒక్కరోజే 54,736 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం కరోనా బాధితుల సంఖ్య  (COVID19 Positive cases in India) 17,50,724 (17.5 లక్షలు)కు చేరింది. Sushant Case: రియా చక్రవర్తి జాడ దొరకడం లేదు: బిహార్ డీజీపీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 853 మంది కరోనా బారిన పడి ప్రాణాలు (COVID19 Deaths in India) కోల్పోయారు. ఇప్పటివరకూ భారత్‌లో మొత్తం కోవిడ్19 మరణాలు (COVID19 Death Toll in India) 37,364కు చేరుకున్నాయి. అయితే మొత్తం కేసులకుగానూ 10లక్షలకు పైగా బాధితులు కరోనా మహమ్మారిని జయించడం గమనార్హం. భారత్‌లో చికిత్స అనంతరం 11,45,630 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 5,67,730 యాక్టివ్ కేసులున్నాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..


దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,98,21,831 (1.98 కోట్లు) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 4,63,172 శాంపిల్స్‌ నిన్న ఒక్కరోజే COVID19 టెస్ట్ చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. CoronaVirusపై 110 ఏళ్ల బామ్మ అలవోక విజయం


దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 11.45 లక్షలకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. అయితే కరోనా బాధితుల రికవరీ రేటు క్రమక్రమంగా పెరుగుతుండటంపై హర్షం వ్యక్తం చేసింది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్ 
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos