బ్రేకింగ్ న్యూస్: 649కి పెరిగిన `కరోనా` కేసులు
`కరోనా వైరస్` భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
'కరోనా వైరస్' భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
భారత దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 649కి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో 593 మందికి పాజిటివ్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇప్పటి వరకు 42 మంది కరోనా వైరస్ కు చికిత్స తీసుకుని సురక్షితంగా బయటపడ్డారని ప్రకటించింది. ఐతే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 13 మంది మృతి చెందినట్లు వెల్లడించింది.
'కరోనా వైరస్'పై పోరాటానికి పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల విరాళం
జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ కారణంగా చైనా, ఇటలీలో వ్యాపించినంత వేగంగా భారత దేశంలో విస్తరించడం లేదనే చెప్పాలి. ప్రజలకు కూడా నిత్యావసరాలు తీసుకునేందుకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ కారణాలతో కరోనా వైరస్ కు కాస్త అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. మరోవైపు అందరూ శుభ్రత, పరిశుభ్రతను అలవాటు చేసుకున్నారు. ఫలితంగా కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..