కోల్‌కతా: లోక్ సభ రెండో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని రాయగంజ్‌ స్థానం నుంచి సీపీఐ(ఎం) పార్టీ తరపున బరిలో నిలిచిన మొహమ్మద్ సలీం ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఓవైపు ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు తమను భయబ్రాంతులకు గురిచేసేలా కాల్పులు జరపడం వెనుక పశ్చిమ బెంగాల్ అధికారిక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని మొహమ్మద్ సలీం ఆరోపించారు. 


రాయగంజ్ లోక్ సభ పరిధిలోని ఇస్లాంపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం అతడి వాహనాలశ్రేణిపై ఇటుకలు, రాళ్లతో దాడి జరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై నివేదిక అందించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.