Govt jobs: CRPFలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఎంపిక విధానం
ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ (AR)-156, బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF)- 365, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)-1537, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ITBP)- 130, స్పెషల్ సెక్యురిటీ బ్రాంచ్ (SSB)- 251 పోస్టులను భర్తీ చేయనున్నారు.
CRPF paramedical staff recruitment notification: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో (CRPF) పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,439 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సీఆర్పీఎఫ్ తమ నోటిఫికేషన్‌లో కోరింది. విభాగాల వారీగా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ (AR)-156, బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF)- 365, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)-1537, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ITBP)- 130, స్పెషల్ సెక్యురిటీ బ్రాంచ్ (SSB)- 251 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Eligibility - అర్హతలు:
పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గతంలో CAPF లో కానీ ఎక్స్ ఆర్మీ ఉద్యోగులై కానీ ఉండాలి. (మహిళలు, పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు).
Selection process - ఎంపిక విధానం:
ఎంపికైన అభ్యర్థులు CAPF ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పారామెడికల్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Age limit - ఏజ్ లిమిట్: ఆశావహులైన అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
Interview dates - ఇంటర్వ్యూ తేదీలు:
ఈ ఇంటర్వ్యూలను 13-09-2021 నుంచి 15-09-2021 వరకు నిర్వహించనున్నారు.
అభ్యర్థులను ఏడాది కాలం పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటారు.
Original documents - ఒరిజినల్ డాక్యుమెంట్స్ :
ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలనార్థం తమ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ సర్టిఫికేట్, డిగ్రీ, వయసు నిర్ధారణ, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: https://bit.ly/3CUIi8U