గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఐఇడి బాంబు పేల్చారు. లోక్ సభ ఎన్నికల పోలింగ్ విధుల్లో భాగంగా సేవలు అందించేందుకు వెళ్తున్న 191వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌పై ఇట్టపల్లికి సమీపంలోని గట్టా వద్ద మావోయిస్టులు ఈ పేలుడుకు పాల్పడ్డారు. మావోయిస్టుల దాడిలో ఒక జవాన్ గాయపడినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు తక్షణమే కూంబింగ్ ప్రారంభించినట్టు సమాచారం అందుతోంది. 


చత్తీస్‌ఘడ్‌లోనూ ఇదే తరహాలో దాడి జరిపిన మావోయిస్టులు ఓ బీజేపి ఎమ్మెల్యేను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.