UGC NET 2020 Exam Dates: యూజీసీ నెట్ 2020 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
UGC NET 2020 Exam Schedule: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ 2020ను రీషెడ్యూల్ చేసింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేసిన పరీక్ష మరోసారి వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది.
CSIR UGC NET 2020 Exam Schedule: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ 2020ను రీషెడ్యూల్ చేసింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేసిన పరీక్ష మరోసారి వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది. నవంబర్ 19, 20, 26 తేదీలలో దేశ వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాలలో యూజీసీ నెట్ 2020 పరీక్షను నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసింది.
వచ్చే నెలలో పరీక్ష కావడంతో అడ్మిట్ కార్డులను ఇప్పుడే విడుదల చేయడం లేదని తెలిపింది. అభ్యర్థులకు వచ్చే నెలలో తగిన సమయానికి యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్స్ 2020ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. నెట్ 2020 హాల్ టికెట్లు విడుదల చేస్తే ఈ కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
How to download CSIR UGC NET Admit card 2020:
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్స్ 2020 ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
1. అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ఓపెన్ చేయాలి
2. వెబ్‌సైట్ హోం పేజీలో CSIR UGC NET admit card 2020 మీద క్లిక్ చేయాలి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలతో లాగిన్ అవ్వాలి
4. UGC NET admit card 2020 మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.
4. యూజీసీ నెట్ 2020 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మళ్లీ అవసరం ఉంటుంది కనుక ప్రింట్ అవుట్ తీసుకోవడం బెటర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe