CUET UG 2022 Results Out: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET) యూజీ 2022 ఫలితాలు విడుదల అయ్యాయి. జాతీయ పరీక్షల మండలి (NTA) సీయూఈటీ యూజీ ఫలితాలను విడుదల చేసింది. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలు విడుదల చేసినట్టు ఎన్‌టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను www.nta.ac.in, https://cuet.samarth.ac.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గురువారం రాత్రి 10 గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడతాయని ముందుగా ప్రకటించినా.. కొన్ని కారణాలతో ఆలస్యం అవుతోందని ఎన్‌టీఏ ట్వీట్‌ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా 259 నగరాలు/పట్టణాల్లో 489 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో సీయూఈటీ యూజీ 2022 పరీక్షను  నిర్వహించారు. మొత్తంగా ఆరు దశలుగా జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 14.9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. 44 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 12 స్టేట్‌ యూనివర్సిటీలు, 11 డీమ్డ్‌ యూనివర్సిటీలు మరియు 19 ప్రయివేటు వర్సిటీలతో కలిపి దేశ వ్యాప్తంగా 99 విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటిసారి ఎన్‌టీఏ పరీక్షను నిర్వహించింది.



అన్ని యూనివర్సిటీలు కొత్త విద్యా సంవత్సరాన్ని అక్టోబర్‌ చివరలో లేదా నవంబర్‌ తొలి వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు యూజీసీ ఛైర్మన్‌ ఎం జగదీశ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఈ పరీక్షలో అభ్యర్థి రాసిన సరైన సమాధానానికి ఐదు మార్కులు (+5) ఇస్తారు. తప్పు సమాధానానికి ఒక మైనస్ మార్క్ (-1) ఇస్తారు. అయితే ఆన్సర్ చేయకుండా వదిలివేసిన ప్రశ్నలకు మాత్రం ఎలాంటి మార్కులు ఇవ్వరు. 


రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:
# అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
# హోమ్‌పేజీలో CUET UG 2022 తాత్కాలిక ఆన్సర్ కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి
# లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి
# లాగిన్ పేజీలో సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి 
# ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది
# ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడోరోజు తగ్గిన పసిడి ధర!


Also Read: Horoscope Today: ఆ రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ప్రమోషన్ వచ్చే అవకాశం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook