Heavy rains are expected in AP, Odisha, West Bengal Due to Jawad Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బలపడింది. నేడు మధ్యాహ్నం ఇది తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఇప్పటికే ఈ తుఫానుకు 'జవాద్​'గా నామకరణం (Jawad Cyclone) చేసిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుఫాను ప్రభావంతో ప్రస్తుతం గంటకు 60-70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలో మీటర్లు, ఒడిశాలోని పారాదీప్​కు ఆగ్నేయంగా 650 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.


తుఫాను ప్రభావం (Jawad Cyclone impact on AP) ఆంధ్రప్రదేశ్, ఒడిశాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో డిసెంబర్​ 4 సాయంత్రం నాటికి గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని చెప్పింది.


తుఫాను కారణంగా.. డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు ఏపీ, బెంగాల్​, ఒడిశా, అసోం, మేఘాలయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ (IMD on Jawad Cyclone) అంచనా వేసింది.


ఈ నెల 5న తుఫాను పూరీ తీరాన్ని తాకి.. బెంగాల్ వైపు కదులుతుందని భావిస్తోంది ఐఎండీ. ఈ సమయంలో తీర ప్రాంతాల్లోని జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.


ఎన్​డీఆర్​ఎఫ్ అప్రమత్తం.. 


తుఫాను తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో.. ఒడిశా, పశ్చిమ్ బెంగాల్​, ఆంధ్రప్రదేశ్​ (Jawad Cyclone rains effect) రాష్ట్రాలకు 46 ఎన్​డీఆర్​ఎఫ్​ టీమ్స్​ను పంపినట్లు ఎన్​డీఆర్​ఎఫ్​ డీజీ అతుల్​ కర్వాల్​ వెల్లడించారు. మరో 18 టీమ్స్​ అవసరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. తుఫాను ప్రభావంతో ఏ ప్రాంతాలోనైనా ఎయిర్​లిఫ్ట్ (హెలికాప్టర్​ల ద్వారా తరలింపు)కు ఎన్​డీఆర్​ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నట్లు (NDRF alert over Jawad Cyclone) చెప్పారు. ఒక్కో ఎన్​డీఆర్​ఎఫ్​ టీమ్​లో 30 మంది చొప్పున సిబ్బంది ఉంటారని తెలిపారు. 



Also read: Omicron scare: నిన్న బెంగళూరు.. నేడు ముంబయి, ఢిల్లీలో ఒమిక్రాన్ భయాలు!


Also read: Travel History లేని బెంగళూరు వైద్యుడికి ఒమిక్రాన్‌.. భయాందోళనలో భారత్! ఇంతకీ ఎలా సోకింది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook