హుద్‌హుద్ ( Hudhud )..తిత్లీ..గజ..జల్ ( Jal ) ..పైలీన్ ఇలా ఒక్కొక్క తుపానుకు ఒక్కో పేరు. అసలీ పేర్లను పెట్టేది ఎవరు ? ఎప్పట్నించి ఈ పద్ధతి అమల్లో ఉంది ? ఇంకా జాబితాలో ఉన్న పేర్ల వివరాలేంటి ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో చోట ఎప్పుడో సారి తుపాన్లు వస్తూనే ఉంటాయి. ఎన్నో సముద్రాలు..ఎన్నో తుపాన్లు. మరి వీటన్నింటినీ గుర్తుంచుకోవాలంటే ఎలా. అందుకే తుపాన్లకు పేర్లు ( Naming of Cyclones ) పెడుతుంటారు. అట్లాంటిక్ సముద్ర ( Atlantic ocean ) ప్రాంతాల్లో వచ్చే తుపాన్లకు పేర్లు పెట్టడమనేది 1953 నుంచే అమల్లో ఉంది. ఐక్యరాజ్యసమితి  ( UNO ) అనుబంధ సంస్థ అయిన  ప్రపంచ వాతావరణ సంస్థ ఈ పేర్లు పెడుతుంది. మరి దక్షిణాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో తుపాన్లకు పేర్లు పెట్టడం 2004 నుంచే ప్రారంభమైంది. అంతకుముందు హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్లకు పేర్లు లేనేలేవు. 


2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ( World Meteorological Organization ) ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు 8 పేర్ల చొప్పున సూచించాయి. మొత్తం 8 దేశాలు 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను తయారైంది. అప్పట్నించి వచ్చిన 64 తుపాన్లతో పేర్లన్నీ పూర్తయ్యాయి. 


ఈసారి 13 దేశాలు కలిసి..ఒక్కోదేశం 13 పేర్లు చొప్పున సూచించడంతో 139 పేర్లు చేరాయి జాబితాలో. ఈ కొత్త జాబితాలో ఇప్పటికే రెండు పేర్లు వాడేసారు. బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ్ ( Nisarg ), ఇండియా సూచించిన గతి ( Gati) తుపాన్లు ఇప్పటికే వచ్చి వెళ్లాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న నివర్ తుపాను పేరును ఇరాన్ సూచించింది. 


బంగాళాఖాతం ( Bay of Bengal )లో ఏర్పడిన నివర్ సైక్లోన్..తూర్పుతీరం వైపుకు దూసుకొస్తోంది. తమిళనాడు తీరంతో పాటు ఏపీ,కర్నాటక రాష్ట్రాల్లోని పలు జిల్లాల్ని ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా  ఉన్న నివర్ ( Nivar )..మరి కొన్నిగంటల్లో పెను తుపానుగా మారనుంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్న తుపాను ఇవాళ అర్ధరాత్రి  తీరం దాటనుంది. 


గతి, తేజ్, మురసు, ఆగ్, వ్యామ్, ఝుర్, ప్రొబాహు, నీర్, ప్రభంజన్, ఘర్ని, అంబుద్, జలధి, వేగ పేర్లను భారత్ సూచించింది. ఇందులో గతి తుపాన్ ఇప్పటికే వచ్చి వెళ్లిపోయింది. Also read: Nivar Cyclone live updates: దూసుకొస్తున్న తుపాను, అతి భారీ వర్షాల హెచ్చరిక