`నా తొలి గురువు నాన్నమ్మే`
`నా తొలి గురువు నాన్నమ్మే, ఆమె నాకు మార్గదర్శి` అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
'నా తొలి గురువు నాన్నమ్మే, ఆమె నాకు మార్గదర్శి" అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి సందర్భంగా రాహుల్ ఆమెకు ఘన నివాళి అర్పించారు. "దాదీ (నాయనమ్మ).. నీతో గడిపిన ఆనందక్షణాలు ఒక్కొక్కటి నాకు ఇంకా గుర్తున్నాయి " అంటూ రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఇందిరా గాంధీ శత జయంతి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించింది. దేశంలోని అన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితలు శక్తిస్థల్ లోని ఇందిరా సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరాగాంధీతో సన్నిహింతగా ఉండే ఒక ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.