MP Suicide: ముంబాయిలో ఘోరం చోటుచేసుకుంది. దాద్రా అండ్ నాగర్ హవేలి ఎంపీ మోహన్ డేల్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. హత్యనా..ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ ఆర్ధిక రాజధాని ముంబాయి( Mumbai)లో వెలుగుచూసిన ఘటన కలకలం రేపుతోంది. ముంబాయిలోని ఓ హోటల్ రూమ్‌లో దాద్రా అండ్ నాగర్ హవేలీ( Dadra and nagar haveli ) లోక్‌సభ ఎంపీగా ఉన్న మోహన్ డేల్కర్ మృతదేహం కన్పించడం ఆందోళన కల్గిస్తోంది. మోహన్ డేల్కర్ దాద్రా అండ్ నాగర్ హవేలీ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. మృతదేహం వద్ద గుజరాతీ భాషలో రాసుకున్న సూసైడ్ నోట్ కూడా లభించింది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. 


ముంబాయిలోని మరీన్ డ్రైవ్ ఏరియాలో ఉన్న హోటల్ సీ గ్రీన్ ( Hotel sea green )‌లో మోహన్ డేల్కర్ ( Mohan Delkar )మృతదేహం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. ప్రాధమిక దర్యాప్తులో ఆత్మహత్యగా పరిగణిస్తున్నా..ఇంకా అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. 58 ఏళ్ల మోహన్ డేల్కర్ 1989 నుంచి దాద్రా అండ్ నాగర్ హవేలీ నుంచి ఎంపీ ( Dadra and nagar haveli mp mohan delkar )గా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 2019లో మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడి..స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. మరణానికి కారణాలేంటనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అటు ఆత్మహత్యేనని పోలీసులు ఇంకా ధృవీకరించకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


Also read: Family suicide: బీజేపీ మాజీ అధ్యక్షుడి ఇంట్లో నలుగురు ఆత్మహత్య..కారణాలేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook