Family suicide: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడి ఇంట తీరని విషాదం చోటుచేసుకుంది. ఏమైందో తెలియదు గానీ ఒకరు కాదు ఇద్దరు కాదు..నలుగురు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.
రాజస్థాన్ ( Rajasthan) రాష్ట్రంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బీజేపీ( BJP ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్‌లాల్ సైనీ కుటుంబ సభ్యులు నలుగురు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. మృతుల్ని మదన్లాన్ భార్య తారా, అతని ఇద్దరు కుమార్తెలు అంజు, పూజ, సోదరుని కుమారుడు హనుమాన్ ప్రసాద్ సైనీలుగా పోలీసులు గుర్తించారు.
2020 సెప్టెంబర్ నెలలో మదన్‌లాల్ ( Madanlal saini )పెద్ద కుమారుడు చనిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యారు. ఇంకా అందులోంచి బయటపడలేదని స్థానికుల సమాచారం. కుటుంబసభ్యుడిని కోల్పోయిన బాధతోనే అంతా ఆత్మహత్యకు ( Madanlal family suicide ) పాల్పడ్డారని భావిస్తున్నారు. మదన్‌లాల్ సోదరుని కుమారుడైన మృతుడు హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినట్టు భావిస్తున్న సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత బతకాలనే ఆశ లేదని ఆ లేఖలో ఉంది. మృతదేహాల్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధతో అందరూ ఆత్మహత్య చేసుకోవడం వెనుక వేరే కారణమేదైనా ఉందా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also read: CISF Recruitment 2021: మాజీ ఆర్మీ సిబ్బంది కోసం పెద్దఎత్తున ఉద్యోగాలు, అర్హత, జీతం, ఎంపిక విధానం ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook