దావూద్ ఇబ్రహీం ( Daud Ibrahim ) . పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోనే పేరుమోసిన అండర్ వరల్డ్ డాన్ Underworld Don ) . ప్రత్యేక చట్టం కింద ఈ అండర్ వరల్డ్ డాన్ పూర్వీకుల ఆస్థుల్ని వేలం వేయనుంది ప్రభుత్వం. వేలంపాటకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా సహా పలు ప్రపంచదేశాల్లో ఉగ్రదాడులు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి తెలిసిందే. ఉగ్రదాడులకు పాల్పడి దేశం వదిలి పారిపోయిన దావూద్ ఇబ్రహీం కోసం  ఇండియా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అతని ఆస్థుల్ని వేలం ( Daud ibrahim properties to be auction )  వేయనుంది ప్రభుత్వం.  స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ కింద ఈ వేలం ప్రక్రియ జరగనుంది. మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్‌లో దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన స్థిరాస్థులు ఉన్నాయి. వీటిని నవంబర్ 10న వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. 


1993 వరుస పేలుళ్లతో ముంబైను గడగడలాడించిన అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీంకు ఇటీవల సంచలనం కల్గించిన కేరళ గోల్డ్ స్కాం ( Kerala Gold scam ) లో ప్రమేయమందని తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం  ( Underworld Don Daud Ibrahim ) పేరును.. ఈ కేసులో ఎన్ఐఏ  అధికారులు ప్రస్తావించారు. ప్రదాన నిందితునికి, దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని అనుమానాలు వ్యక్తంచేశారు. అంటే ఎన్ ఐ ఏ నివేదిక ప్రకారం స్మగుల్ గోల్డ్ నిధులు దావూద్ ఖాతాలోకి చేరుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.


కరోనా వైరస్ ( Corona virus ) నేపథ్యంలో వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఇప్పటికే దావూద్ ఆస్థుల  వేల్యువేషన్​ ప్రక్రియ ముగిసింది. రత్నగిరి జిల్లా ఖేడ్​ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్​ పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్ ఇబ్రహీం​కు స్థిరాస్తులు ఉన్నాయి. 1980లో ఇక్కడున్న బంగ్లాలోనే దావూద్​ కుటుంబ సభ్యులు నివాసముండేవారు. ఈ భవంతిని దావూద్​ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద రాయించాడు. 


1993 ముంబై పేలుళ్ల ( 1993 Mumbai Blasts ) అనంతరం దావుద్​ కుటుంబసభ్యులు ఈ భవంతిని విడిచిపెట్టారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే స్థితికి చేరుకుంది. తాజాగా ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్​ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమయ్యారు. అదేవిధంగా దావూద్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లను కూడా అదే రోజున వేలం వేయనున్నారు. Also read: AFCAT Exams 2020 ఫలితాలు విడుదల! చెక్ చేయడం ఇలా..