Death Thereat Mail to Mukesh Ambani: రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదింపులు వచ్చాయి. ఒక గుర్తుతెలియని వ్యక్తి 20 కోట్ల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఇమెయిల్‌ పంపించాడు. ఈ వ్యవహారంపై ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. "మా వద్ద బెస్ట్ షూటర్లు ఉన్నారని.. రూ.20 కోట్లు ఇవ్వ కుంటే ముఖేష్ అంబానీని చంపేస్తానని" మెయిల్ లో ఉంది. కేసు ఫెయిల్ చేసిన ముంబై పోలీసులు ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విచారణ ప్రారంభించిన పోలీసులు.. 
ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ బెదిరింపు మెయిల్ ఆధారంగా గాందేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేశారు. చేసిన వారు ఏదైనా దుశ్చర్య చేయటానికి ప్రయత్నిస్తున్నారా..? లేదా ఏదైనా ప్రణాళికలో భాగమా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు మరియు దానిపై సమాచారం సేకరిస్తున్నామని.. పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని త్వరలోనే బయటపెడతామని పోలీసులు తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 


ముఖేష్ అంబానీకి జెడ్ ప్లస్ భద్రత..  
వచ్చిన బెదిరింపుల దృష్ట్యా, ముఖేష్ అంబానీ మరియు అతని కుటుంబానికి Z ప్లస్ సెక్యూరిటీ అందిస్తున్నారు. Z ప్లస్ సెక్యూరిటీ దేశంలో మరియు విదేశాలలో కూడా అంబానీ మరియు అతని కుటుంబ సభ్యులకు అందించబడుతుంది. కానీ సెక్యూరిటీకి అయ్యే ఖర్చులన్నీ.. ముకేశ్ అంబానీ భరించాల్సి ఉంటుంది. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ వర్గంపై చాలా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.


Also Read: Thalapathy Vijay : ఫైనల్ గా హీరో విజయ్ రిటైర్మెంట్ పై క్లారిటీ..


2022లో, త్రిపుర హైకోర్టు హోం మంత్రిత్వ శాఖ అధికారిని పిలిపించి, అంబానీ మరియు అతని కుటుంబం ఎదుర్కొంటున్న సంక్షోభంపై నివేదిక ఇవ్వాలని కోరింది. జూన్ 2022లో, త్రిపుర హైకోర్టు ముందు ఫైల్‌ను సమర్పించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. ఆగస్టు 2022లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం త్రిపుర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ముగించింది.


Also Read: Pregnancy : ఈరోజే పవర్ఫుల్ చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తప్పక ఇవి పాటించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..