ఆగస్టు 8 నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల తాకిడితో కేరళ రాష్ట్రం అల్లాడుతోంది. రుతుపవనాలు, అల్పపీడనాల వల్ల ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. ఎక్కడికక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. వరద నీరు ఊర్లను ముంచెత్తడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అటు వరదల తాకిడికి చనిపోయిన వారి సంఖ్య 167కు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాట్లాడుతూ.. కేరళలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన భీభత్సానికి ఇప్పటివరకు 167 మంది మృతి చెందినట్లు తెలిపారు.



శుక్రవారం భారత వాతారణ శాఖ మరోసారి కేరళకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో (కాసర్గోడ్ తప్ప) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు కూడా ఇదే హెచ్చరిక వర్తిస్తుందని వాతావరణ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.



 


అటు భారీ వర్షాలు, వరదల కారణంగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ని అధికారులు తాత్కాలిరంగా మూసివేశారు. మెట్రో రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వందిపెరియార్‌లో వరదలో చిక్కుకున్న 16 మందిని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రక్షించింది. అటు స‌హాయ‌క చ‌ర్యల్లో 26 ఎన్డీఎఫ్ బృందాలు పాల్గొన్నాయి.