'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగం అందుకుంది. మూడు రోజుల నుంచి  పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.  దీంతో సర్వత్రా  ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా  లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21రోజులపాటు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కానీ కొంత మంది లాక్ డౌన్ సరిగ్గా పాటించకుండా .. వైరస్ వ్యాప్తికి బీజం వేయడం ఆందోళన కలిగిస్తోంది.అలాంటిదే ఓ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.  ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. 


ముర్షిదాబాద్‌లోని గోపీపూర్  మసీదులో వందకు పైగా ముస్లింలు ఒకే చోట చేరి ప్రార్థనలు చేశారు. నిన్న శుక్రవారం రోజున ముర్షిదాబాద్ లోని ఓ మసీదులో వందల మంది ముస్లింలు ప్రార్థనకు  హాజరయ్యారు. వారంతా ఒకే చోట గుమిగూడి ప్రార్థనలు  చేసి  బయటకు వచ్చారు.  వారిలో కొంత మందికి మాత్రమే మాస్కులు ఉన్నాయి. మిగతా వారు చాలా మంది మాస్కులు లేకుండా..  కరోనా వైరస్‌ సోకకుండా ఎలాంటి  నివారణలు  పాటించకుండా మసీదు నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



మరోవైపు మసీదులో ప్రార్థనలకు హాజరై.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ముస్లింలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 50 మందిని అరెస్టు చేసి .. వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఐతే ముందుగా వారిని క్వారంటైన్‌కు తరలించి.. ఆ తర్వాత పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయిన వారిని ఆస్పత్రులకు తరలిస్తారు. ఒకవేళ  కరోనా సోకని వారు ఎవరైనా ఉంటే.. లాక్ డౌన్ తర్వాత వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..