పెను ప్రమాదకరంగా మారిన కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో  అన్ని ప్రాథమిక పాఠశాలల్ని బుధవారం మూసివేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. అవసరాన్ని బట్టి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటామని ఆయన ప్రకటించారు. పాఠశాలల్లో ఉదయంపూట నిర్వహించే ప్రేయర్ సహా, ఆటలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించరాదని  పాఠశాల యాజమాన్యాలను ఆయన ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు అందే వరకు కొద్దిరోజులు ఇలానే కొనసాగించాలని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నారులందరూ బయట సంచరించేటప్పుడు తప్పకుండా ముఖాలకు మాస్కులు ధరించాల్సిందిగా అధికారులు తెలిపారు. రోజురోజుకీ  తీవ్రమవుతున్న కాలుష్యాన్ని నియంత్రిచేందుకు ఢిల్లీ అధికారులు చర్యలు చేపట్టారు. 


కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను కొన్ని రోజుల పాటు మూసివేయాల్సిందిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌ ద్వారా మంత్రి మనీశ్‌ సిసోడియాను కోరారు. ప్రమాదకర స్థితిలో ఢిల్లీ కాలుష్యం ఉందని, దీని కారణంగా ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, పొద్దునే పొగమంచులో తిరగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.