Delhi Air Quality  దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు ఆందోళనకర స్థాయికి పడిపోతోంది. సూచీలో గాలి నాణ్యత గురువారం (Air Auality in Delhi Today) 360 వద్ద ఉన్నట్లు గాలి నాణ్యత పరిశోధన విభాగం వెల్లడించింది. ఇది అత్యంత ప్రమాదకార స్థాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న (బుధవారం) మొత్తం ఇదే పరిస్థితి కొనసాగినట్లు వెల్లడించింది. బుధవారం గాలి నాణ్యత సగటున 382గా ఉన్నట్లు తెలిపింది.


గాలి కాలుష్యం కారణంగా.. రోడ్లన్ని పొగ మంచుతో (Delhi Air pollution Effect) నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



Also read: Tamil Nadu rains: తమిళనాడును వీడని వర్షాలు- చెన్నైకి రెడ్ అలర్ట్​


Also read: Chidambaram: బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు, చిదంబరం కీలక వ్యాఖ్యలు


గాలి నాణ్యత సూచీ ఇలా..


  • గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే బాగుందని అర్థం

  • 51-100 మధ్య ఉండే పరవాలేదని అర్థం చేసుకోవచ్చు

  • 101-200 మధ్య ఉంటే ప్రమాదపుటంచున ఉన్నట్లు చెప్పొచ్చు

  • 201-300 మధ్య ఉంటే.. నాణ్యత ప్రమాదకరగా ఉందని చెబుతుంటారు

  • 301-400 మద్య ఉండే.. తీవ్ర ప్రమాదకరస్థాయిలో ఉందని అర్థం

  • 401 దాటితే.. గాలి నాణ్యత అత్యంత కనిష్ఠ స్థాయిలో (ప్రమాదంలో) ఉందని చెప్పొచ్చు


కాలుష్యానికి కారణాలు..


వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే వాయువలతో పాటు.. అక్కడ ప్రతి శీతాకాలం గాలి నాణ్యత అంత్యంత దారుణ స్థాయికి(air Pollution in Delhi) పడిపోతుంది. ఢిల్లీకి సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం సహా పలు ఇతర అంశాలు ఇందుకు కారణం.


కాలుష్యాన్ని తగ్గించేందుకు.. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రహదారుల వెంబడి వాటర్ ట్యాంకర్లను, స్మగ్ గన్​లను ఏర్పాటు చేసింది.


Also read: Mother sells 3day old son : పేద‌రికంతో పేగుబంధాన్ని అమ్ముకున్న తల్లి


Also read: Singhu border : నిరసన చేపడుతోన్న చోటే ఉరి వేసుకున్న రైతు


ఇటీవల రికార్డు కనిష్ఠానికి గాలి నాణ్యత..


ఈ నెల ఆరంభంలో గాలి నాణ్యత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్​ క్యాంపస్​.. 466 పాయింట్ల వద్దకు పడిపోయింది.


ఇటీవలి సర్వేలో భయంకరమైన విషయాలు వెల్లడి..


ఢిల్లీలో వాయుకాలుష్యం, దాని ప్రభావంపై ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ సర్వే నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎక్కువ శాతం మంది కాలుష్యం కారణంగా గొంతు మంట, దగ్గు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మక్కు కారడం, కళ్లు మండటం సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకొంత మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.


అత్యంత తక్కువ మంది మాత్రమే కాలుష్యంతో తామకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడంలో లేదని చెప్పారు.


మరింత ఆందోళన కలిగించే విషయమేమింటే.. ఢిల్లీ, గురుగ్రామ్​, నోయిడా వంటి ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉండే  ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 28 శాతం మంది మాత్రమే ఎయిర్ ప్యూరిఫైయర్​లను వినియోగిస్తున్నట్లు తేలింది. ఎక్కువ మంది మాస్క్​ ద్వారా మాత్రమే కాలుష్యం నుంచి రక్షణ పొందుతున్నారు.


Also read: Suicide: పరువు పోయిందనే బాధతో...విషం తాగి ఐదుగురు ఆత్మహత్య


Also read: Minor girls Raped : మూడేళ్ల బాలికపై 26 ఏళ్ల యువకుడి హత్యాచారం.. పది రోజుల్లో ముగ్గురిపై రేప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook