Tamil Nadu rains: తమిళనాడును వీడని వర్షాలు- చెన్నైకి రెడ్ అలర్ట్​

IMD forecasts on Tamil Nadu: తమిళనాడులో వర్షాలు ఆగటం లేదు. రాష్ట్రంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 07:35 PM IST
  • తమిళనాడుకు మరోసారి భారీ వర్ష సూచన
  • 3 రోజులు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం
  • చెన్నైలో అతి భారీ వర్షాలు పడొచ్చన్న ఐఎండీ
Tamil Nadu rains: తమిళనాడును వీడని వర్షాలు- చెన్నైకి రెడ్ అలర్ట్​

IMD issues red alert for Chennai: తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. మరో మూడు నుంచి నాలుగు రోజల పాటు వర్షాలు పడే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD on Tamil Nadu rains) అంచనా వేస్తోంది.

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో.. గత 10 రోజులుగా తమిళనాడులో జోరుగా వానలు (Heavy rains in Tamil Nadu) పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నైని వరదలు ముంచెత్తాయి. వరదలు, భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్థంభించింది. ఇప్పటి వరకు (Deaths due to Heavy rains in Tamil Nadu) రాష్ట్రంలో 12 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఈ ప్రభావం నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే.. మరోసారి భారీ వర్ష సూచనలు చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ).

Also read: Mother sells 3day old son : పేద‌రికంతో పేగుబంధాన్ని అమ్ముకున్న తల్లి

Also read: Chidambaram: బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు, చిదంబరం కీలక వ్యాఖ్యలు

పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఇవాళ ఉదయం మరింతగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా మారి..ఆ తరువాత తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో.. తమిళనాడులో.. చెన్నై, చెంగాల్పట్టు, కాంచీపురం సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. చెన్నైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురవచ్చని తెలిపింది. 

అల్ప పీడనం ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్​, పుదుచ్చేరిలో కూడా వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ.

Also read: Rajasthan Accident update: బస్సు, ట్రక్కు ఢీ...11 మంది మృతి, 22 మందికి గాయాలు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

Also read: Singhu border : నిరసన చేపడుతోన్న చోటే ఉరి వేసుకున్న రైతు

ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..

వర్షాల కారణంగా ఇప్పటికే రెండు రోజుల సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభావం. మరోసారి భారీ వర్షాలకు అవకాశమున్న నేపథ్యంలో ప్రజలెవ్వరూ అవసరమైతే తప్పా.. బయటకు రావద్దని సూచించింది. ఇప్పటికే వరద నీటిలో చిక్కుకున్న వారికి సాయం అందిస్తున్నట్లు పేర్కొంది. వరద బాధితుల సహయాం కోసం కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దించినట్లు వివరించింది.

ఇదివరకే కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. వరదల్లో చిక్కుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్​ నిలిపివేయడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు రాత్రుళ్లు  చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి తెలెత్తింది.

Also read: Suicide: పరువు పోయిందనే బాధతో...విషం తాగి ఐదుగురు ఆత్మహత్య

Also read: Security Council: ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, సవాళ్లపై ఢిల్లీలో ముగిసిన భద్రతా సదస్సు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News