Mother sells 3day old son : పేద‌రికంతో పేగుబంధాన్ని అమ్ముకున్న తల్లి

Poverty stricken woman sells newborn son : సెప్టెంబ‌ర్‌లో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఒక మ‌హిళ త‌మ కుటుంబం పేద‌రికంలో మ‌గ్గుతుండ‌టంతో శిశువును అమ్ముకోవాలనుకుంది. ఓ పక్క తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. మరోవైపు ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకునే స్థోమత కూడా తనకు లేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 04:48 PM IST
  • మూడు రోజుల ప‌సికందును అమ్ముకున్న పేద‌రికంతో త‌ల్ల‌డిల్లిన త‌ల్లి
  • రూ. 1.78 ల‌క్ష‌ల‌కు కొడుకును అమ్ముకున్న తల్లి
  • మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా షిర్డీలో ఘ‌ట‌న
  • త‌ల్లితో స‌హా న‌లుగురు వ్య‌క్తులు అరెస్ట్
Mother sells 3day old son : పేద‌రికంతో పేగుబంధాన్ని అమ్ముకున్న తల్లి

Poverty stricken mother sells 3 day old son for Rs 1.78 lakh in Mumbai: పేద‌రికంతో త‌ల్ల‌డిల్లిన ఓ త‌ల్లి మూడు రోజుల ప‌సికందైన త‌న క‌న్న‌ కొడుకును అమ్మేసింది. ముంబైలోని ఓ వ్య‌క్తికి రూ. 1.78 ల‌క్ష‌ల‌కు (1.78 lakh) అమ్మింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని (Maharashtra) అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా (Ahmednagar district) షిర్డీలో (Shirdi town) చోటుచేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌లో తల్లితో పాటు ఆమెకు స‌హ‌క‌రించిన న‌లుగురిని శిశువును కొనుగోలు చేసిన వ్య‌క్తిని పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. ఇటీవల మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఒక మ‌హిళ త‌మ కుటుంబం పేద‌రికంలో మ‌గ్గుతుండ‌టంతో శిశువును అమ్ముకోవాలనుకుంది. ఓ పక్క తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. మరోవైపు ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకునే స్థోమత కూడా తనకు లేదు. అందుకే ఆ చిన్నారిని అమ్మాలని నిర్ణయించుకుంది ఆ తల్లి (mother).

తన శిశువును విక్ర‌యించేందుకు ఆమెకు అహ్మ‌ద్‌న‌గ‌ర్‌, థానేకు (Thane) చెందిన క‌ళ్యాణ్‌, ముంబైలోని (Mumbai) ములుంద్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు స‌హ‌క‌రించారు. ములుంద్‌లో నివ‌సించే ఒక వ్య‌క్తికి ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన లాంఛ‌నాలు పూర్తిచేయ‌కుండానే రూ 1.78 ల‌క్ష‌ల‌కు (1.78 lakh) శిశువును అమ్మేశారు.

Also Read : RRR: చరణ్‌, ఎన్టీఆర్‌ ‘నాటు’ డ్యాన్స్‌ మామూలుగా లేదుగా..!

ఈ విష‌య‌మై పోలీసులకు స‌మాచారం అందడంతో ఆ వ్య‌క్తి ఇంటిపై దాడులు చేప‌ట్టారు. అక్కడ శిశువు క‌నిపించాడు. దీంతో నేరానికి పాల్ప‌డిన ప‌సిబిడ్డ త‌ల్లితో స‌హా న‌లుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు (Police) అరెస్ట్ (Arrest) చేసి అదుపులోకి తీసుకున్నారు.

Also Read : AP-Odisha Border Issue: ఆ పదహారు గ్రామాల పయనం ఎటు, ఏపీలోనా లేదా ఒడిశాలోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x