Corona Third Wave: కరోనా మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలే పరిస్థితులు కన్పించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ నుంచి తేరుకునేలోగా..థర్డ్‌వేవ్ ముప్పు ఆందోళన కల్గిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ విషయంలో ఢిల్లీ ఐఐటీ నివేదిక ఏం చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి దేశం అల్లకల్లోలమవుతోంది. ఇంకా దేశం పూర్తిగా కరోనా మహమ్మారి నుంచి కోలుకోలేదు. కరోనా విపత్కర పరిస్థితులతో జనం విలవిల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్టు కన్పిస్తున్నప్పటికీ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. డిల్లీ ఐఐటీ విడుదల చేసిన నివేదిక భయాందోళన రేపుతోంది. థర్డ్‌వేవ్‌లో(Corona Third wave) రోజుకు 45 వేల కేసులు నమోదవుతాయని అంచనా ఉంది. ప్రతి రోజూ 9 వేలమంది ఆసుపత్రుల్లో చేరే అవకాశాలున్నాయి.


ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ఐఐటీ నివేదిక(Delhi IIT Report)లో సూచించారు. అటువంటి పరిస్థితి తలెత్తితే రోజుకు ఢిల్లీ నగరానికి 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమౌతుందని అంచనా. దాంతో ఢిల్లీలో థర్డ్‌వేవ్ (Corona Third wave)ఎదుర్కొనేందుకు ఇప్పట్నించే సన్నాహాలు ప్రారంభించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరా, నిర్వహణపై డిల్లీ ఐఐటీ-ఢిల్లీ ప్రభుత్వం(Delhi Government) కలిసి పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో మౌళిక సదుపాయాల కల్పనపై రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. 


Also read: Monsoon: రుతుపవనాలు ఎప్పుడు..తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook