Monsoon: రుతుపవనాలు ఎప్పుడు..తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో వర్షాలు

Monsoon: నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. కేరళ తీరాన్ని తాకిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని పలకరించనున్నాయి. భగభగమండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 30, 2021, 05:59 PM IST
  • జూన్ 3న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
  • మరో పదిరోజుల్లో ఏపీ, తెలంగాణల్లో ప్రవేశించనున్న రుతుపవనాలు
  • వారం రోజుల్లో గోవా, కర్నాటకలో ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
Monsoon: రుతుపవనాలు ఎప్పుడు..తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో వర్షాలు

Monsoon: నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. కేరళ తీరాన్ని తాకిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని పలకరించనున్నాయి. భగభగమండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది.

మండు వేసవి అనంతరం ఆశగా, ఆతృతతో ఎదురు చూసేది రుతుపవనాల కోసం. ప్రతియేటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. అయితే ఈసారి మాత్రం మే 31వ తేదీనే నైరుతి రుతుపవనాలు (Monsoon)కేరళను తాకుతాయని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. కానీ ఇప్పుడు కాస్త ఆలస్యంగా అంటే జూన్ 3వ తేదీన రానున్నాయి. జూన్ మొదటి వారంలో కర్నాటక, గోవా తీరాల్ని నైరుతి రుతు పవనాలు చేరుకోనున్నాయని ఐఎండీ తెలిపింది. 

వారం రోజుల్నించి భగభగమండే ఎండలతో రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. తొలకరి వర్షాల (Rains) కోసం ప్రజానీకం ఎదురుచూస్తోంది. జూన్ 3న కేరళను (Kerala) తాకిన వారం రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అంటే మరో పదిరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. అటు ఎండల తీవ్రత కూడా తగ్గనుంది. తౌక్టే, యాస్ తుపానుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల (Monsoon) రాకలో మరింత ఆలస్యమవుతుందనే ఆందోళన నెలకొన్నా..సకాలానికే రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలియడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Also read: Zydus Cadilla: త్వరలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్, చిన్నపిల్లలపై కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News