Delhi Government: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని పిల్లలకు దూరం చేస్తే..మరికొన్ని కుటుంబాల్లో పిల్లల్నించి తల్లిదండ్రుల్ని దూరం చేస్తోంది. అటువంటి అనాథ పిల్లల కోసం ఢిల్లీ ప్రభుత్వం చేయూత అందించేందుకు నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోవిడ్ మరణాల రేటు అధికంగా ఉంటోంది. కొన్ని కుటుంబాల్లో తల్లితండ్రుల్నించి పిల్లలను దూరం చేస్తే, మరికొన్ని కుటుంబాల్లో పిల్లల్నించి తల్లితండ్రులను దూరం చేసింది. ఫలితంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి..పిల్లలు అనాథలవుతున్నారు. ఇటువంటి అనాథ పిల్లల విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం (Ap govenrment) సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. అనాథ పిల్లల పేరిట పది లక్షల రూపాయలు డిపాజిట్ వేసి..నెల నెలా ఆ వడ్డీను అందించనుంది. 25 ఏళ్ల అనంతరం ఆ డబ్బును సదరు పిల్లలు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏపీ బాటలో పయనిస్తోంది.


కోవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం( Delhi Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిన్నారులకు 25ఏళ్లు వచ్చేవరకూ ప్రతి నెల 2 వేల 5 వందల రూపాయలు జమ చేయడమే కాకుండా ఉచిత విద్య అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. అదేవిధంగా పేద కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఈ నెల 10 కిలోల ఉచిత రేషన్ లభిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో సగం ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుండగా..మిగిలింది కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా  అందించనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబానికి నెలకు 2 వేల 5 వందల రూపాయలు అందిస్తామన్నారు. 


Also read: Tauktae Cyclone Effect: ముంబై మహా నగరాన్ని అతలాకుతలం చేసిన తౌక్టే తుపాను


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook