ప్రశాంతంగా ఢిల్లీ ఎన్నికల పోలింగ్
దేశ రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకు ముందే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం పోలింగ్ కోసం 13 వేల 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకు ముందే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం పోలింగ్ కోసం 13 వేల 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు కోటి 47 లక్షల మంది ఓటర్లు నేడు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఐతే ప్రధానంగా పోటీ మాత్రం ఇప్పటికే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
[[{"fid":"181789","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
వీఐపీ ఓటింగ్
ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వల్ల ఓటర్లు బారులు తీరడం కనిపించింది. విపరీతంగా ఉన్న చలిని కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే మాటియాలా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజేష్ గెహ్లట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ సుమేష్ శౌకీన్ ను బరిలోకి దించింది. గులాబ్ సింగ్ యాదవ్ ఆమ్ ఆద్మీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం గులాబ్ సింగ్ యాదవ్ .. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు కరోల్‌బాగ్‌లోని ఝండేవాలన్ ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ పరిశీలించారు. అక్కడి పోలింగ్ ఏర్పాట్లపై బీజేపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు.
[[{"fid":"181790","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
అటు హరినగర్ బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఢిల్లీ నగర బీజేపీ అధ్యక్షుడు తేజిందర్ పాల్ సింగ్.. ఉదయమే గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం హరినగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలో తొలిసారిగా సామాన్య పౌరులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని అందించారు. 80 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధులకు, వికలాంగులకు ఈ సౌకర్యం లభిస్తుంది. ఈసారి 2 లక్షలకు పైగా వృద్ధులకు, 50 వేల మంది దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు.