దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ( Coronavirus ) తగ్గుతుంటే..ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ( Delhi ) లో పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీలో ఇప్పుడు కరోనా వైరస్ మూడవ దశ ( Corona third phase in delhi ) నడుస్తోందని కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ సంక్రమణ ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ పుంజుకుంటోంది. శీతాకాలం ప్రభావమో..మరొకటో ఇంకా తెలియదు గానీ ఇటీవల కొద్దిరోజులుగా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా  5 వేల 673 కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. అటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ( Central health minister Dr harshvardhan ) సైతం ఢిల్లీలో కరోనా వైరస్ మూడవ దశ నడుస్తోందని చెప్పడం ఈ ఆందోళనను మరింతగా పెంచుతోంది. అటు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ( Delhi minister Satyendra jain ) సైతం కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని పూర్తిగా కొట్టిపారేయలేదు.


ఢిల్లీలో మూడవదశ నడుస్తుందనేది అప్పుడే చెప్పలేమని..మరో వారం రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు. మూడవ దశకు చేరే అవకాశం మాత్రం ఉందని ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు దాదాపున 4 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో రోజుకు 15 వేల కొత్త కేసులు నమోదయ్యే పరిస్థితి వస్తుందని ఇప్పటికే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ( National centre for disease control ) హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో గత కొద్దికాలంగా కేసులు పెరుగుతుండటమనేది ఊహించని పరిణామని మంత్రి తెలిపారు. పండుగల సీజన్, శీతాకాలం కావడంతో ఇప్పటివరకూ అనుసరిస్తున్న పద్ధతుల్లో మార్పులు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే స్కూల్స్, పాఠశాలల్ని మరో నెలపాటు మూసివేశాయని ప్రభుత్వం నిర్ణయించింది.


ఢిల్లీలో ప్రస్తుతం 29 వేల 378 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 70 వేలున్నాయి. ఓ వైపు కరోనా లక్షణాలున్నవారిని ముందుగా పరీక్షలు చేసి...తరువాత కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని..ఢిల్లీ ఆసుపత్రుల్లో పడకలు సిద్ధం చేయాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీడ్ కంట్రోల్ సూచించింది. Also read: Rajinikanth: రాజకీయాల నుంచి రజ‌నీకాంత్ వైదొలగనున్నారా..! క్లారిటీ ఇచ్చిన తలైవా