COVID-19 cases in Delhi: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ సంక్షోభంలో చిక్కుకుంటోంది. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాటల్లోనే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓవైపు ఢిల్లీలో 24 గంటల్లో దాదాపు 24 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంటే.. మరోవైపు ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ (Oxygen shortage), లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా పేరున్న యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వ్యాక్సిన్, ఐసీయూ బెడ్స్‌కి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. ఇదివరకు రోజురోజుకూ పెరుగుతూ వచ్చిన పేషెంట్స్ సంఖ్య ఇప్పుడు గంటకు గంటకు పెరుగుతోంది. దీంతో బెడ్స్ ఖాళీ లేక, ఆక్సీజన్, యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వ్యాక్సిన్ కొరత కారణంగా కొవిడ్-19 ఆస్పత్రులు సైతం చేతులెత్తేసే పరిస్థితి తలెత్తుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ''గత 24 గంటల్లో ఢిల్లీలో దాదాపు 24 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు గుర్తించినట్టు నివేదికలు అందుతున్నాయని, అలాగే మరోవైపు ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ (Oxygen cylinders suppliers), ఐసీయూ బెడ్స్, రెమిడిసివిర్ వ్యాక్సిన్‌కి కొరత ఎక్కువైంది'' అని అన్నారు. కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.


ఇంకొద్ది రోజులపాటు పరిస్థితిని సమీక్షిస్తామని, పరిస్థితిలో మార్పురాకుంటే ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎంతటి తీవ్ర నిర్ణయమైనా తీసుకోవడానికైనా తమ ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లోనే 6 వేల వరకు బెడ్స్ (COVID-19 beds) పెంచామని, అయినా పరిస్థితి ఎప్పుడు ఎలా చేయిదాటిపోనుందో ఎవరికీ తెలియదని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు.  


Also read : COVID-19 vaccine తొలి డోస్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన Sonu Sood


గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం 4100 బెడ్స్ ఇచ్చిందని, కానీ ఈసారి కేవలం 1800 బెడ్స్ మాత్రమే ఇచ్చారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. 50 శాతం బెడ్స్ కొవిడ్-19 పేషెంట్స్‌కి కేటాయించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్‌ని కోరానని... అలాగే మెడిసిన్స్ (COVID-19 treatment medicines) స్టాక్ బ్లాక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు.


పరిస్థితి అదుపులోకి రాకుంటే ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎంతటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడబోమని సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) చెబుతున్న తీరు చూస్తోంటే ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ (Lockdown in Delhi) విధించినా ఆశ్యర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Also read: Sputnik v vaccine: స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది..సైడ్ ఎఫెక్ట్స్ చాలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook