Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ ? స్పందించిన మంత్రి Satyendar Jain

Lockdown in Delhi, Minister Satyendar Jain clarity: కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత రోజుకింత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో గురువారం వరకే అప్పటికి గత 4 రోజుల్లో మొత్తం 4758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొత్తంలో నమోదైన 4193 కేసుల కంటే ఈ సంఖ్యే అధికంగా ఉండటం Delhi govt తో పాటు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది.

Last Updated : Mar 27, 2021, 05:03 PM IST
  • కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత రోజుకింత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా కట్టడికి ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తారా అనే అనుమానాలు.
  • ఢిల్లీలో మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్న కరోనా కేసులు
  • ఢిల్లీలో లాక్‌డౌన్ రూమర్స్‌పై స్పందించిన Delhi health Minister Satyendar Jain.
Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ ? స్పందించిన మంత్రి Satyendar Jain

Lockdown in Delhi, Minister Satyendar Jain clarity: కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత రోజుకింత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో గురువారం వరకే అప్పటికి గత 4 రోజుల్లో మొత్తం 4758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొత్తంలో నమోదైన 4193 కేసుల కంటే ఈ సంఖ్యే అధికంగా ఉండటం ఢిల్లీ సర్కారుతో పాటు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఒకవేళ ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే తమ పరిస్థితి ఏంటని ఢిల్లీ వాసులు, ఢిల్లీలో బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలు, బయటి రాష్ట్రాల వాళ్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఢిల్లీలో లాక్‌డౌన్ రూమర్స్‌కి చెక్ పెడుతూ తాజాగా ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఓ ప్రకటన చేశారు. 

ఢిల్లీలో లాక్‌డౌన్ ( Delhi lockdown news) ఊహాగానాలపై ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంజర్ జైన్ స్పందిస్తూ.. ''ఢిల్లీ సర్కార్ ఇప్పటికైతే ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే ఆలోచనలో లేదు'' అని స్పష్టంచేశారు. 'ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తే కరోనావైరస్ తగ్గుతుందని చెబితే అలాగే చేశాం. అయినప్పటికీ కరోనావైరస్ తీవ్రత తగ్గలేదు. అందుకే కరోనాకు చెక్ పెట్టేందుకు లాక్‌డౌన్ విధించడం అనేది సరైన పరిష్కారం కాదు అనేది తన అభిప్రాయం' అని మంత్రి సత్యేందర్ జైన్ తేల్చిచెప్పారు. 

Also read: Holi 2021 వేళ విజృంభిస్తున్న Corona.. వివిధ రాష్ట్రాల్లో ఇలా కఠిన చర్యలు, ఆంక్షలు

కరోనావైరస్ (Coronavirus) అనేది అంత త్వరగా పూర్తిగా తగ్గిపోయేది కాదని.. కొన్నాళ్లపాటు కరోనాతో కలిసి బతకక తప్పదని ఆరంభంలోనే వైద్య నిపుణులు చెప్పారని మంత్రి సత్యేందర్ జైన్ గుర్తుచేశారు. అందుకే కరోనాతో కలిసి బతకడం అలవాటు చేసుకోక తప్పని పరిస్థితి అని పేర్కొన్న మంత్రి.. కరోనా వ్యాక్సిన్‌కి అర్హులైన ఢిల్లీ వాసులు వ్యాక్సిన్ (Corona vaccine) తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా సూచించారు. 

గత 24 గంటల్లో ఢిల్లీలో (COVID-19 in Delhi) 1534 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 16న 1547 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఆ తర్వాత మళ్లీ అంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. నిన్నటి శుక్రవారం మరో 9 మంది కరోనాతో చనిపోయారు. గత 2 నెలల గణాంకాలను పరిశీలిస్తే.. ఒకే రోజు కరోనాతో అంతమంది చనిపోవడం అనేది కూడా ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా (Delhi Corona updates) బారినపడిన వారి సంఖ్య 6,54,276 కి చేరగా.. మొత్తం 6.36 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News