Yamuna River: మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది.. వణికిపోతున్న ఢిల్లీ వాసులు..
Yamuna River: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు.
Yamuna River danger mark: ఉత్తరాదిలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులగా తగ్గుముఖం పట్టిన నదీ ప్రవాహం... బుధవారం ఉదయానికి డేంజర్ స్థాయిని దాటింది. ఇవాళ మార్నింగ్ 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు)ని దాటి 205.48 మీటర్లుగా నమోదైందని కేంద్ర జల కమిషన్ పేర్కొంది. వాటర్ లెవల్ ఈ సాయంత్రానికి 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠ స్థాయి అంటే 208.66మీటర్లుగా నమోదైంది.
నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో కూడా మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. రానున్న రెండు మూడో రోజుల్లో గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. గిర్ సోమ్‌నాథ్, వల్సాద్, అమ్రేలీ, కచ్, నవ్‌సరి, రాజ్‌కోట్ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది.
Also Read: Uttarakhand: భారీ వర్షాలకు ఉప్పొంగిన గంగానది.. హరిద్వార్‌కు అలర్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook