న్యూ ఢిల్లీ: 12వ తరగతి విద్యార్థులకు రోజూ రెండు సబ్జెక్టులపై ఆన్‌లైన్ క్లాసెస్ (online classes) నిర్వహించనున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఇటీవల ఢిల్లీలో హింస (Delhi violence) చెలరేగడం, ఆ తర్వాత కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా నర్ససీ నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేకపోయామని.. అందువల్ల వారిని నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఆ సమయంలో వారికి తరగతులు నిర్వహించలేకపోయినందుకుగాను ఇకపై నిత్యం ఒక యాక్టివిటీ లేదా ప్రాజెక్ట్ వర్కును విద్యార్థుల తల్లిదండ్రలకు ఫోన్ సందేశాల ద్వారా పంపించి విద్యార్థుల చేత అవి చేయించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అదే విధంగా 12వ తరగతి విద్యార్థులకు  (Class 12  students) ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) వివరించారు. సోమవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో (Delhi CM Arvind Kejriwal) కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : అసలు నిజం దాచిన కంపెనీ.. 17 మందికి కరోనా.. సంస్థపై కేసు నమోదు


ఇదిలావుంటే, ఇదే మీడియా సమావేశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు (Ration dealers) గట్టి హెచ్చరికలు జారీచేశారు. పేదలకు అందాల్సిన రేషన్ సరుకులను పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్‌కి తరలించే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేజ్రీవాల్ రేషన్ డీలర్లను హెచ్చరించారు. అంతేకాకుండా ఢిల్లీ పరిధిలో రేషన్ కార్డు (Ration cards) లేని వాళ్లకు కూడా రేషన్ అందిస్తామని.. ఎవ్వరూ కంగారుపడాల్సిన పని లేదని ఢిల్లి వాసులకు భరోసా ఇచ్చిన సీఎం కేజ్రీవాల్.. దయచేసి వదంతులు (Rumours) నమ్మి భయాందోళనలకు గురికావొద్దని ధైర్యం చెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..