Covid-19: రాజధానిలో మార్కెట్లను మూసివేస్తాం: సీఎం కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో మళ్లీ కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులనుంచి నిత్యం వేల సంఖ్యలో కరోనా (Coronavirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తారని పుకార్లు వ్యాప్తిచెందడంతో.. అవన్నీ అవాస్తవమని, లాక్‌డౌన్ విధించడం లేదని వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Kumar Jain) సోమవారం వెల్లడించారు.
Delhi govt plans shut down some markets as COVID-19 cases: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో మళ్లీ కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులనుంచి నిత్యం వేల సంఖ్యలో కరోనా (Coronavirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తారని పుకార్లు వ్యాప్తిచెందడంతో.. అవన్నీ అవాస్తవమని, లాక్‌డౌన్ విధించడం లేదని వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Kumar Jain) సోమవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం మీడియాతో మాట్లాడారు. Also read: Bharat Biotech: కోవాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్యను అదుపు చేయాలంటే.. ముఖ్యమైన మార్కెట్లను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. మార్కెట్లల్లో కోవిడ్-19 నిబంధనలను పాటించడం లేదని.. దీంతో అవి కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ వీలైతే కొన్ని రోజుల పాటు ఢిల్లీలో మార్కెట్లను మూసివేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. దీంతోపాటు శుభకార్యాలకు హాజరయ్యే వారి పరిమితిని 200 నుంచి 50కి తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. Also read: Krithi Shetty: చూపులతో చంపేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి
ఢిల్లీ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల కోసం 750 ఐసీయూ పడకలను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజధానిలో వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్రం, కేంద్రంతోపాటు ప్రభుత్వ ఏజెన్సీలన్నీ కష్టపడి పనిచేస్తున్నాయని.. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కేజ్రీవాల్ కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి