కరోనా వైరస్ (CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో ఢిల్లీ ఒకటి. తాజాగా ఆప్ నేత, ఢిల్లీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్(Satyendra Jain) కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలతో ఆయన రెండు రోజుల కిందట (మంగళవారం) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. జ్వరం, కాస్త ఆలసటతో పాటు కరోనా లక్షణాలున్నట్లుగా భావించిన మంత్రి సత్యేంద్ర కరోనా టెస్టులకు వెళ్లారు. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా బుధవారం సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్ (Satyendra Jain Tested COVID19 positive)‌గా తేలింది. ఆయన ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెండోసారి నిర్వహించిన కోవిడ్19 టెస్టులోనూ ఆయనకు పాజిటివ్‌గా రావడంతో కన్ఫామ్ అయ్యారు. అంతకుముందు గత ఎన్నికల్లో ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించిన ఎమ్మెల్యే అతిషికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో ఆమె హోమ్ క్వారంటైన్ అయ్యారు. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు


ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఆరోగ్యశాఖతో పాటు సత్యేంద్ర జైన్‌ నిర్వహించే అన్ని శాఖలను అదనపు బాధ్యతలుగా అప్పగించారు. పటేల్ నగర్ ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్ సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ