Delhi Highcourt Verdict: భర్తలకు బిగ్ రిలీఫ్.. భార్య ఇంట్లో పనులు చేయడం క్రూరత్వం కిందకు రాదు.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
Family Disputes:ఇంట్లో సాధారణంగా భార్యలు పనులు చేస్తుంటారు. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే కొందరు ఒకరికి మరోకరు ఆసరాగా ఉంటారు. ఢిల్లీకి చెందిన ఒక మహిళ తన భర్త ఇంట్లో పనులు చెప్పి వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయిచింది. ఈ ఘటనపై విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పువెలువరించింది.
Husband Expecting A Wife To Do House Hold: ఒకప్పుడు భర్తలు ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్యలు మాత్రం... ఇంటి పనులు చేస్తు, పిల్లలను చూసుకుంటే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఉన్న కాస్ట్ ఆఫ్ లీవింగ్ కు, ఇప్పటికి చాలా భిన్నంగా ఉంది. వేటీ ఖర్చు చూసుకున్న కూడా తడిసి మోపెడవుతుంది. ఇక భార్యభర్తలలో ఇద్దరు ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమై పోయింది. ఇక ఉద్యోగాలు చేసేటప్పుడు.. ఇద్దరు ఇంట్లో పనులు చేసుకొవాల్సి ఉంటుంది. పనులు కూడా షేర్ చేసుకుంటే, ఇద్దరికి కాస్తంతా రిలాక్స్ గా ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఇంట్లో పనులు ఎంతో భారంగా భావిస్తుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Read More: భార్యభర్తల కాపురంలో చిచ్చుపెట్టిన లిప్ స్టిక్.. స్టోరీ మాములుగా లేదుగా..
ఢిల్లీకి చెందిన ఒక మహిళ తన భర్త ఇంట్లోని పనులు చెబుతు టార్చర్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సదరు బాధితుడు వాదన మరోలా ఉంది. తన భార్య కావాలని అసత్య ఆరోపణలు చేస్తుందని అతను అన్నారు. పెళ్లైన తర్వాత నుంచి తల్లిదండ్రులను వదిలేసి, సపరేటా ఉందామని తన భార్య వేధిస్తుందని, దీనికి ఒప్పుకోకపోవడం వల్ల ఇలా లేని అసత్య ఆరోపణలు చేసిందని కూడా బాధితుడు కోర్టుకు వివరించాడు. ఇద్దరిని విచారణ చేశాక.. ఢిల్లీ హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది.
భార్య చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎలాంటి ప్రూఫ్స్ లేవని కోర్టు పేర్కొంది. మహిళ.. ఉద్దేష్య పూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేసినట్లు తెలుస్తోందని మందలించింది. చిన్నతనం నుంచి కష్టపడి పెంచిన తల్లిదండ్రులను వదిలేసి, వేరుగా కాపురం పెట్టమనడం సబబు కాదని పేర్కొంది. పెళ్లైన తర్వాత భర్త బాధ్యతలను, భార్య క కూడా పంచుకోవాలను కోవడం క్రూరత్వం కిందకురాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
వృద్ధాప్యంలో ఎటువంటి ఆదాయ వనరులు లేని లేదా అతితక్కువ ఆదాయ వనరులు ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన నైతిక, చట్టపరమైన బాధ్యత కుమారుడికి ఉందని, హిందూ కొడుకు తన కుటుంబం నుండి విడిపోవడమనేది వాంఛనీయ సంస్కృతి కాదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
Read More: ToothBrush: మీ టూత్ బ్రష్ బాత్రూమ్ లో పెడుతున్నారా..?.. ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా..?
"నరేంద్ర వర్సెస్ కె. మీనా కేసులో, కొడుకును తన కుటుంబం నుండి వేరు చేయమని కోరడం క్రూరత్వానికి సమానమని సుప్రీంకోర్టు గమనించింది. భారతదేశంలో హిందూ కుమారుడికి ఇది సాధారణ పద్ధతి కాదని పేర్కొంది. వివాహం తర్వాత అతని కుటుంబం నుండి విడిపోవడానికి ఇష్టపడే సంస్కృతిమనదికాదని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని విభాగాలలో, భర్త ఆర్థిక బాధ్యతలను తీసుకుంటాడు. భార్య ఇంటి బాధ్యతను నిర్వర్తిస్తుంది. ప్రస్తుత సందర్భం అలాంటిది. ప్రతివాది ఇంటి పనులు చేయాలని అప్పీలుదారు ఆశించినప్పటికీ, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని కోర్టు పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook