Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇవాళ మరోసారి విచారించనుంది. ఆమెతో పాటు ఏపీ అధికార పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డిని కూడా ఈడీ విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఇతని కుమారుడు మాగుంట రాఘవ అరెస్టయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ చాలా విషయాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఈ కేసులో ప్రమేయముందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బడాబాబులంతా అరెస్టయ్యారు. ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఒకసారి, ఈడీ రెండుసార్లు విచారించింది. ఈడీ ఇవాళ మరోసారి ఎమ్మెల్సీ కవితను విచారించనుంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావల్సిందిగా ఈడీ అధికారులు కవితను కోరారు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఏపీ అధికార పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని విచారణకు రావల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. ఎంపీ మాగుంటను కూడా ఈడీ ఇవాళే విచారించనుంది. ఈ కేసులో ప్రధానంగా విన్పిస్తున్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంటదే కావడం విశేషం.


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో మిగిలింది ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాత్రమే. మిగిలిన బడాబాబులంతా అంటే ఢిల్లీ మంత్రులతో సహా అంతా అరెస్టయ్యారు. ఇవాళ మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఎమ్మెల్సీ కవితను కలిపి ఈడీ విచారించే అవకాశాలున్నాయి. 


నిన్నటి కవిత ఈడీ విచారణ


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ ఇంకా వెంటాడుతూనే ఉంది. మార్చ్ 11న తొలిసారి 8 గంటల విచారణ, మార్చ్ 20న రెండవసారి 11 గంటల విచారణ చేసినా ఇంకా ఈడీ అనుమానాలు నివృత్తి కాలేదు. ఇవాళ మరోసారి ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు రావల్సిందిగా నోటీసులు ఇచ్చింది ఈడీ. 


నిన్న రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకూ కొనసాగిన విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత విక్టరీ సింబల్ చూపిస్తూ నవ్వుతూ బయటికొచ్చారు. నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు. నిన్నటి విచారణలో 14 ప్రశ్నలపై పదే పదే లోతుగా విచారించినట్టు తెలుస్తోంది. తనను రాజకీయ ఒత్తిడిలో భాగంగా విచారిస్తున్నారా, లేక నిందితురాలిగా పిలిచారా అని ఈడీని కవిత ప్రశ్నించగా అనుమానితురాలిగా పిలిచామని ఈడీ సమాధానమిచ్చింది. 


ఇవాళ జరిగే విచారణ ఈ కేసులో కీలకం కానుంది. ఎమ్మెల్సీ కవితను మూడవసారి విచారించనుండటమే కాకుండా ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డిని కూడా విచారణ కూడా ఉండటంతో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరినీ ఇవాళ అరెస్టు చేస్తే కేసు దాదాపు కొలిక్కి వచ్చేసినట్టే.


Also read: Delhi liq​uor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook