Delhi Avenue Court Remands K Kavitha To ED Till 23 March:  దేశంలో ఒకవైపు సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఇక, మరో వైపు తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెను మార్చి 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలను జారీచేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణాలో బీఆర్ఎస్ శ్రేణులకు ఇది పరిణామంగా భావించవచ్చు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నేతలమనోధైర్యాన్ని దిగజార్చడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న నీచపు రాజకీయాంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక.. కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రనిరాశ నెలకొందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటన దేశంలోని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Lok Sabha Elections 2024: దేశంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు..


ఈడీ అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేసి, ఆమె ఉపయోగించిన ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆమెను రాత్రికి రాత్రే అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.ఈ సమయంలో కవిత ఇంట్లో పెద్ద హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ అధికారులు వచ్చారని తెలియగానే కేటీఆర్, హరీష్ రావు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకున్నారు. మొదట కేటీఆర్, హరీష్ రావును కూడా ఈడీ అధికారులు లోపలికి అనుమంచలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఇక మరోవైపు.. కేటీఆర్, ఈడీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది.


ఒకనోక సమయంలో కేటీఆర్, ఈడీ అధికారులను తీవ్రంగా ఎండగట్టారు. ఒక మహిళా నాయకురాలిని, ఎలాంటి ట్రాన్సిట్ నోటీసు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ కూడా వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు అరెస్టు చేయమని చెప్పి,ఇలా దొడ్డి దారిన వచ్చి సోదాలేంటని మండిపడ్డారు.


Read More: Chapati Making: చపాతీలు మెత్తగా, దూదిలా రావాలా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..


అదేవిధంగా.. ఇవి కేవలం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ల కుట్రలని వ్యాఖ్యానించారు. శుక్రవారం అకస్మాత్తుగా తనిఖీల కోసం రావడం, అది కూడా కోర్టు సమయం దాటిపోయాక రావడంవెనుక మతలేబు ఏంటని ఎద్దేవా చేశారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook