Chapati Making: చపాతీలు మెత్తగా, దూదిలా రావాలా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

How to make soft chapati: మనలో చాలా మంది చపాతిని ఎంతో ఇష్టంతో తింటారు. ఇక షూగర్ పెషెంట్లు తప్పనిసరిగా చపాతీలు తింటారు. నార్త్ వైపున చపాతీలు లేనిదే ముద్ద దిగదని చెప్పుకొవచ్చు. రోజు అక్కడ తినేఫుడ్ లలో రోటీలు ఉండాల్సిందే.

1 /6

చపాతీలు ప్రతిఒక్కరు ఇష్టంతో తింటారు. కానీ చపాతీలు చేయడం అందరికి కుదరదు. కొందరు చపాతీలు చేస్తే గట్టిగా పాపడ్ ల మాదిరిగా మారుతాయి. అంతే కాకుండా రోటీ చేసేటప్పుడు చపాతీ పూర్తిగా మాడిపోతుంది. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే చపాతీలు దూదిలాగా మెత్తగా మారుతాయి.  

2 /6

చపాతీల పిండిని మొదట ఒక గిన్నెలో తీసుకొవాలి. దానిలో నీళ్లను పోస్తు చక్కగా కలపాలి. చపాతి ముద్ద చెతికి అంటుకోకుండా ఉండేంత వరకు కలపాలి. ఇలా కలిపిన ముద్దను ఒక ఐదు నిముషాల పాటు అలానే ఉంచేయాలి. ఆతర్వాత ముద్ద మీద ఒక చెంచాడు నూనెను వేయాలి..

3 /6

నూనె వేసిన తర్వాత మరల చపాతీముద్దను మరోసారి అన్ని వైపులా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక.. మరోవైపు పెనంను గ్యాస్ స్టౌవ్ మీద పెట్టుకొవాలి. పెనం బాగా వేడి అయ్యేవరకు చపాతీలుముద్దను చిన్నటి రౌండ్ ముద్దలుగా చేసుకొవాలి. ఆ తర్వాత రోటీ కర్రలతో చపాతీని అన్నివైపులా మెత్తగా రౌండ్ గా మారేలా రోల్ చేసుకొవాలి..

4 /6

చపాతీలను పెనం మీద వేసి పదిసెన్లపాటు అలానే ఉంచాలి. కాసేపయ్యాక.. మరోవైపు కూడా రివర్స్ లో చపాతీలు వేసి కాలేలా చూసుకొవాలి. కార్నర్ లు బాగా కాలేలా చూసుకొవాలి. ఇలా చేస్తే చపాతీలు మెత్తగా తయారువుతుంది.ముఖ్యంగా షుగర్ పెషెంట్లకు ఇది వరమని చెప్పవచ్చు. ఈజీగా తినొచ్చు

5 /6

కొందరు చపాతీలు చేసేటప్పుడు... కొందరు నూనె కూడా వేస్తారు. ఇలా  చేస్తే చపాతీలు మెత్తగా వస్తాయి . కానీ కొందరు ఆయిల్ వేయడం ఇష్టపడరు. అందుకే ఎవరికి నచ్చిన విధంగా చపాతీలు అలా మెత్తగా చేసుకొవాలి.  

6 /6

రోటీలను రాత్రివేళల్లో ఎక్కువ మంది తింటారు. ముఖ్యంగా సమ్మర్ లో మామాడి పండ్లతో రసాలను చేసుకుని, చపాతీతో పాటు తింటారు. కొందరు పాలక్ పన్నీర్ తో , టమాటా, ఆలు కర్రీల కాంబినేషన్ లతో కూడా రోటీలను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)