Sunitha Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. అయినా జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన చేస్తున్నారు. మరోవైపు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే బీజేపీ డిమాండ్‌ను ఆప్ నేతలు తోసిపుచ్చుతున్నారు. కీలకమైన నిర్ణయాలు జైలు నుంచే తీసుకుంటున్నారు. మంత్రివర్గానికి, ఆయనకు మధ్య అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కీలక భూమిక పోషిస్తున్నారు. మరోవైపు 55 మంది ఆప్ ఎమ్మెల్యేలతో సునీతా కేజ్రీవాల్ ఇవాళ భేటీ అయ్యారు. భేటీ ఎందుకనేది స్పష్టం చేయకపోయినా జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలనకు మద్దతిచ్చేందుకేనని తెలుస్తోంది. 


బీజేపీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని ఆప్ ఎమ్మెల్యేలు సునీతా కేజ్రీవాల్‌కు సూచించినట్టు తెలుస్తోంది. రాజ్యాంగపరంగా లేదా చట్టపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తన భార్య సునీతను ముఖ్యమంత్రి చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలతో ఆమె భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 


మరోవైపు ఢిల్లీ మంత్రి అతిషి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు నెలల్లో అంటే లోక్‌సభ ఎన్నికలకు ముందు నలుగురు ఆప్ నేతలు అరెస్ట్ అవుతారని అతిషి తెలిపారు. ఈ నలుగురిలో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఈడీ తన పేరుని, సౌరభ్ భరద్వాజ్ పేరుని ఛార్జిషీటులో నమోదు చేసిందని చెప్పారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా తమ పోరాటం ఆగదన్నారు. తామంతా అరవింద్ కేజ్రీవాల్ సైనికులమని స్పష్టం చేశారు.


Also read: Supreme Court: యోగా గురుపై సుప్రీంకోర్టు ఆగ్రహం, చర్యలకు సిద్ధంగా ఉండమని ఆదేశాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook