Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు, వాంగ్మూలం వెనక్కి తీసుకున్న పిళ్లై
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత విచారణకు ముందే ఈ పరిణామం జరగడం గమనార్హం. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు షాక్ తగిలింది. హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్రన్ పిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది.
ఢిల్లీ మద్యం కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్రన్ పిళ్లైను ఇటీవలే ఈడీ అరెస్టు చేసింది. టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా పిళ్లై ఒప్పుకున్నట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను నిన్న అంటే మార్చ్ 9వ తేదీన ఈడీ విచారించాల్సి ఉంది. అయితే తన ముందస్తు షెడ్యూల్ కారణంగా హాజరుకాలేనని..పదవ తేదీ తరువాత హాజరౌతానని చెప్పడంతో ఈడీ అంగీకరించింది. మార్చ్ 11 అంటే రేపు విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది.
రేపు కవిత విచారణ ఉందనగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీకు తానిచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని రామచంద్రన్ పిళ్లై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు..ఈడీకు నోటీసులు పంపింది. రేపు అంటే మార్చ్ 11న ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావల్సి ఉండగా పిళ్లై వాంగ్మూలం ఉపసంహరణ చర్చనీయాంశంగా మారింది.
Also read: Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్.. నెక్ట్స్ ఎవరు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook