న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వింత సంఘటన కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. కాగా నలుగురు స్నేహితులు పార్టీ చేసుకున్న తరవాత ఐస్‌క్రీం తినేందుకు బయటికి వెళ్లారు. తాను ఇచ్చిన ఐస్ క్రీంను నిరాకరించాడనే నెపంతో 25 ఏళ్ల వ్యక్తిని హత్య చేశారని భావిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఐస్ క్రీం తీసుకోనని చెప్పిన అమిత్ శర్మ (25) ను హత్య చేసిన లక్షయ్ (27) అనే విద్యార్థి, ఒక కారు షో రూంలో సేల్స్ ఎగ్జిక్యూటివిగా పనిచేస్తున్న అతని అన్న కరణ్ (29), సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే స్నేహితుడు ధీరజ్ (26), షాప్ కీపర్ అవినాష్ (25) లను సంఘటన జరిగిన నాలుగు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మీరట్‌లోని లాలా లజపతిరాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో చదివే లక్షయ్ ఇటీవలే ఎంబిబిఎస్ పరీక్షలు రాశాడని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: హైదరాబాద్‌కి వైరస్ రిస్క్ ఎక్కువ.. జనం భయపడతారనే చెప్పలేదు : సీఎం కేసీఆర్


రోహిణిలో తన ఇంట్లో కరణ్.. ధీరజ్, అవినాష్‌లతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారని, కాసేపటి తర్వాత అంతా కలిసి ఐస్‌క్రీం కోసం బయలుదేరారు. అయితే శర్మ, అతని బావమరిది రాహుల్, మరో స్నేహితుడు ఇషాంత్ కనపడ్డారని, అప్పటికే మద్యం మత్తులో ఉన్న లక్షయ్, తన సోదరుడు, స్నేహితులతో కలిసి శర్మకు , అతని స్నేహితులకు ఫ్రీగా ఐస్‌క్రీం ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ వాళ్లు కాదనడంతో గొడవ మొదలైందని అన్నారు. లక్షయ్ బృందం అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చి రోహిణి సెక్టార్ 3 దగ్గర శర్మపై చేసి, కర్రలతో కొట్టి పారిపోయారని పోలీసులు వివరించారు. శర్మను ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. రాహుల్, ఇషాంత్ లక్షయ్ బృందం బైక్‌ల నంబర్లు ఇవ్వడంతో ఆ నలుగురిని నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేసినట్టు అదనపు పోలీస్ కమిషనర్ (రోహిణి) ఎస్‌డి మిశ్రా చెప్పారు. మరోవైపు ఈ హత్యకు ఈ అంశమే కాకుండా మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని మిశ్రా పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Read Also: కరోనాపై అవగాహన