పుల్వామా దాడి సూత్రధారి అనుచరుడి అరెస్ట్
పుల్వామా దాడి సూత్రధారి అనుచరుడి అరెస్ట్
న్యూ ఢిల్లీ: పుల్వామా దాడులకు ప్రధాన సూత్రధారి అయిన ముదాసిర్ అహ్మెద్ ఖాన్‌కి ప్రధాన అనుచరుడైన సజ్జద్ ఖాన్ని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది సజ్జద్ ఖాన్ ఢిల్లీలో శాలువాల వ్యాపారి రూపంలో తిరుగుతుండగా ఎర్రకోట వద్ద పోలీసులు పథకం ప్రకారం వల పన్ని పట్టుకున్నారు. పుల్వామా దాడి అనంతరం మార్చి నెలలో పుల్వామా జిల్లాలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో ఇండియన్ ఆర్మీ బలగాలు ముదాసిర్ అహ్మెద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్‌ని హతమార్చాయి. పుల్వామా దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దర్కి ఆ వాహనం, ఐఈడి పేలుడు పదార్థాలు సమకూర్చింది అతడేనని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్‌లో అనేక చోట్ల జరిగిన ఐఈడి పేలుళ్ల వెనుక ముదాసిర్ అహ్మద్ ఖాన్ హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అంతకన్నా ముందుగా పుల్వామా దాడి గురించి అన్ని విషయాలు తెలిసిన సజ్జద్ ఖాన్ సైతం ముదాసిర్తో ఎప్పటికప్పుడు అందుబాటులో వుంటూ వచ్చాడని పోలీసులు తెలిపారు.