Ex Bigg Boss Show Contestant Police Complaint: దేశంలో మహిళల పట్ల అత్యాచారాలు, దాడుల నిరోధకానికి ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చిన  కొందరు కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. మహిళల కోసం నిర్భయ, షీటీమ్ వంటివి ఉన్నా కూడా మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే మారింది. ప్రతిరోజు మహిళల పట్ల అత్యాచారాలు, దాడులకు  చెందిన ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలు.. 


దక్షిణ ఢిల్లీలోని ఓ ఫ్లాట్‌లో తన స్నేహితుడిపై అత్యాచారం చేశాడని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్,  టెలివిజన్ యాక్టర్ ఆరోపించడంతో ఢిల్లీ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. బాధితురాలి ప్రకారం.. ఈ ఘటన 2023 లో డియోలి రోడ్ ఫ్లాట్‌లో జరిగిందని అధికారి తెలిపారు.  ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని సమాచారం. ఆమె "బిగ్ బాస్" రియాలిటీ షోలో ఆమె పనిచేసిన సమయంలో ఈ నటి ప్రజాదరణ పొందింది.


ముంబైకి చెందిన సదరు యువతి, మోడల్‌గానూ, టెలివిజన్ సీరియల్స్‌లోనూ పనిచేసింది. నిందితుడు యువతిని,  తన నివాసానికి ఆహ్వానించాడని, అక్కడ ఆమెకు ఆహారం,  పానీయాలు ఇచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. "స్నేహితుడు తనకు స్పైక్డ్ డ్రింక్ ఇచ్చారని, ఆపై తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది". ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.


Read Also: High Court: ''దేవాలయాలు పిక్నిక్ స్పాట్ లు కావు..".. హిందూయేతరుల ప్రవేశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాసు హైకోర్టు...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook