Non Hindus Cannot Enter in Temples: సాధారణంగా ఆయా మతాలు, కులాల వారు తమ దైవాలను కొలుస్తుంటారు. హిందువులు దేవాలకు వెళ్తుంటారు. ముస్లింలు మజ్జిత్ లకు వెళ్తారు. అదే విధంగా క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ఇలా సిక్కులు, బౌద్ధులు, జైనులు తమ మతాలకు చెందిన ఆలయాలకు వెళ్లడం మనకు తెలిసిందే. అయితే.. తమిళనాడులోని కొన్ని ఆలయాలలో కేవలం హిందువులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించాలని, ఇతర మతాలకు చెందిన వారిని అనుమతించకూడదని మద్రాస్ హైకోర్టులో డి సెంథిల్‌కుమార్ పిటిషన్ లను దాఖలు చేశారు.
ముఖ్యంగా.. ఆయా పుణ్యక్షేత్రాల్లోని 'కోడిమారం' (ధ్వజస్థంభం) ప్రాంతం దాటి హిందువులు కానివారిని అనుమతించరాదని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ఆలయ ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో ‘కొడిమారం తర్వాత ఆలయంలోకి హిందూయేతరులను అనుమతించరని చాటేలా''.. బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
"హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కానివారిని అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించబడింది. ఎవరైనా హిందువేతరులు ఆలయంలో నిర్దిష్ట దేవతను దర్శించుకొవాలని అనుకుంటే, ప్రతివాదులు అతను కలిగి ఉన్న హిందువేతరుల నుండి హామీని పొందాలి. దేవతపై విశ్వాసం, అతను హిందూ మతం యొక్క ఆచారాలకు కట్టుబడి ఉంటే హిందువేతరులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చని కోర్టు తీర్పు చెప్పింది.
ఆలయాలు అనేవి పిక్నిక్ , టూరిస్టు స్పాట్ లు కావని హైకోర్టు మధురై బెంచ్‌లోని జస్టిస్ ఎస్ శ్రీమతి మద్రాస్ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అన్ని ప్రవేశ ద్వారాలలో ఆ మేరకు డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, గతంలో.. "అరుల్మిఘు బృహదీశ్వర ఆలయంలో ఇతర మతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆలయ ప్రాంగణాన్ని పిక్నిక్ స్పాట్‌గా భావించి, ఆలయ ఆవరణలో మాంసాహారం తీసుకున్నారని స్థానిక వార్తపత్రికలలో కథనాలు వచ్చాయి. దీంతో ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే.
Also Read: Ayodhya: "మూడు రాష్ట్రాల గుండా జర్నీ..".. అయోధ్యకు చేరుకున్న ముస్లిం మహిళ చేసిన వ్యాఖ్యలివే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook