ఢిల్లీలో భారీ వర్షాలు.. భారీగా స్తంభించిన ట్రాఫిక్ జామ్!
ఢిల్లీని వరదలమయం చేసిన వర్షం
ఢిల్లీలో గురువారం ఉదయం నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. ఢిల్లీ శివార్లలోని నొయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరిదాబాద్ లలోనూ వర్షాలు అంతే భారీగా కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా ఘజియాబాద్ లోని వసుంధర ప్రాంతంలో రోడ్డు కుంగిపోగా గ్రేటర్ నొయిడాలోని ముబారక్‌పూర్‌లో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, నొయిడాను అనుసంధానించే ఢిల్లీ-నొయిడా-డైరెక్ట్ (డీఎన్డీ) ఫ్లైవేతోపాటు నొయిడాలోని 12,16, 18, 19, 20, 22 సెక్టార్లలో వరద నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.