Lowest temperature: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత..వణికిస్తున్న చలిగాలులు
చలిపులి విజృంభిస్తోంది. ఉత్తర భారతాన్ని వణికిస్తోంది. రాజధాని నగరం ఢిల్లీని తీవ్రమైన చలిగాలులు గజగజలాడిస్తున్నాయి. 15 ఏళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రత చేరుకోవడంతో ఢిల్లీ తల్లడిల్లుతోంది.
చలిపులి విజృంభిస్తోంది. ఉత్తర భారతాన్ని వణికిస్తోంది. రాజధాని నగరం ఢిల్లీని తీవ్రమైన చలిగాలులు గజగజలాడిస్తున్నాయి. 15 ఏళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రత చేరుకోవడంతో ఢిల్లీ తల్లడిల్లుతోంది.
ఉత్తర భారతంలో చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. రాజధాని ఢిల్లీ ( Delhi ) చలి దుప్పటి కప్పుకున్నా వణికిపోతూనే ఉంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు ( Lowest temperature in Delhi ) నమోదవుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై తీవ్రమైన చలితో ప్రారంభమైంది. ఢిల్లీ నగరంపై తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయిప్పుడు. 2021 జనవరి 1న ఢిల్లీలో కేవలం 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం విశేషం. గత పదిహేనేళ్లలో ఇదే కనిష్టం. అంతకుముందు 2006లో 0.2 డిగ్రీలు, 1935లో 0.6 డిగ్రీల ఆల్ టైమ్ ఉష్ణోగ్రత నమోదైంది. 2019 జనవరిలో 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తీవ్రమైన చలి కారణంగా ఉదయం 6 దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేసింది. మీటర్ దూరంలో ఉన్న వస్తువులు కూడా కన్పించక ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనవరి 2 నుంచి 6 వ తేదీ వరకూ మధ్యధరా ప్రాంతం నుంచి వీచే గాలుల వల్ల...ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుందని ఐఎండీ ( IMD ) సూచించింది.
Also read: Bank holidays in January 2021: జనవరిలో బ్యాంకులకు సెలవులే సెలవులు