Omicron cases: దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో (Omicron cases in India) కొత్తగా నలుగురికి పాజిటివ్​గా తేలింది. దీనితో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారందరికి లోక్​నాయక్ జయ్​ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. అయితే వారందరిలోను స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించింది.


ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్​గా తేలుతున్నట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్​ తెలిపారు. అయతే ఇంకా ఒమిక్రాన్ (Omicron variant)​ సామాజిక వ్యాప్తి దేశకు చేరుకోలేదని.. పరిస్థితులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు.


ఢిల్లీలో తొలుత ఒమిక్రాన్​ వేరియంట్ బారిన పడిన 37 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు సత్యేందర్. సోమవారం అతడికి నెగెటివ్​గా తేలడంతో.. హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్​ చేసినట్లు తెలిపారు.


ఓమిక్రాన్ భయాల నేపథ్యంలో.. ఎయిర్​పోర్ట్​కు వస్తున్న విదేశీ ప్రయాణికులకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు తప్పనిసరి చేశామని.. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే ఎయిర్​పోర్ట్​ను నుంచి వారిని బయటకు పంపుతున్నట్లు గుర్తు చేశారు.


ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 73 ఒమిక్రాన్​ కేసులు (Omicron cases in India) బయపడ్డాయి. అందులో అత్యధికం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి.


Also read: Omicron in Tamil Nadu: తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్ కేసులు.. చెన్నైకి ఒమిక్రాన్ ఎలా వచ్చిందంటే


Also read: Omicron: భారత్ ప్రమాదంలో ఉంది.. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook