Omicron in Tamil Nadu: తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్ కేసులు.. చెన్నైకి ఒమిక్రాన్ ఎలా వచ్చిందంటే

Omicron cases reported in Tamil Nadu: చెన్నై: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమిళనాడుకు కూడా పాకింది. ఇదివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాని తమిళనాడులో ఇవాళ బుధవారం తొలి కేసు నమోదైంది. ఇటీవలై నైజీరియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ 47 ఏళ్ల స్థానికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్థారణ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 11:17 PM IST
Omicron in Tamil Nadu: తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్ కేసులు.. చెన్నైకి ఒమిక్రాన్ ఎలా వచ్చిందంటే

Omicron cases reported in Tamil Nadu: చెన్నై: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమిళనాడుకు కూడా పాకింది. ఇదివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాని తమిళనాడులో ఇవాళ బుధవారం తొలి కేసు నమోదైంది. ఇటీవలై నైజీరియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ 47 ఏళ్ల స్థానికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ (Ma Subramanian) ఒమిక్రాన్ కేసు వివరాలు వెల్లడించారు. 

డిసెంబర్ 10న చెన్నైకి చెందిన వ్యక్తి నైజీరియా నుంచి దోహా మీదుగా చెన్నైకి వచ్చాడు. అతడు వచ్చింది అంత రిస్క్ ఉన్న దేశం కాదని భావించిన అధికారులు అతడిని ఐసోలేషన్‌కి (Isolation) పంపకుండా స్వేచ్చగా వదిలేశారని తెలుస్తోంది. 

Also read : Cashew Nuts Side Effects: ఈ అనారోగ్యాలతో బాధపడేవారు జీడిపప్పు తినకపోవడమే మంచిది!

అయితే, తాజాగా అదే వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజి వెల్లడించడంతో అక్కడి అధికారులు అవాక్కయ్యారు. దీంతో భారత్‌లో ఒమైక్రాన్ వేరియంట్ (Omicron cases in India) సోకిన వ్యక్తుల జాబితాలో తమిళనాడు కూడా వచ్చి చేరింది. 

ఇదిలావుంటే, ఒమిక్రాన్ కేసులకు చెక్ పెట్టేందుకు ముందు నుంచే తమిళనాడు (Omicron cases in Tamil Nadu) రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.

Also read : Mysterious Death Alert: ఒమిక్రాన్‌కు తోడుగా అంతుచిక్కని భయంకర వ్యాధి ముప్పు, పదుల సంఖ్యలో మరణాలు

Also read : Pfizer Covid-19 pills: ఫైజర్ కొవిడ్-పిల్‌తో ఒమిక్రాన్‌‌కి చెక్ పెట్టొచ్చంటున్న ఫైజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News