No Immunity To Mlas, Mps in Bribe For Vote cases: లంచం కేసుల్లో అభియోగాలు మోపబడిన లేదా అడ్డంగా దొరికిపోయిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు కూడా విచారణకు హజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సోమవారం నాడు చారిత్మాక తీర్పును వెలువరించింది. పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలోకానీ ప్రశ్నలు అడగటానికి, ఓటుకైన లంచాలు తీసుకున్నట్లైతే లేదా ఆరోపణలు ఎదుర్కొన్న తప్పకుండా విచారణకు హజరుకావాలని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. కాగా, 1998 నాటి తీర్పును సుప్రీం పక్కన పెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Cashew Empty Stomach: పరగడుపున జీడిపప్పు తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా!


గతంలో ఇచ్చిన తీర్పులో.. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సభలో ప్రసంగం లేదా ఓటు కోసం ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు లంచం తీసుకునే కేసుల్లో చట్టసభ సభ్యులకు మినహాయింపును సమర్థించారు. లంచం, పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షించబడదని,  1998 తీర్పు యొక్క వివరణ రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఈ రెండు ఆర్టికల్స్ ఎన్నుకోబడిన ప్రతినిధులకు ప్రాసిక్యూషన్ నుండి చట్టపరమైన మినహాయింపును అందిస్తాయి.  ఈక్రమంలో నేతలు..  భయం లేకుండా లంచాలు తీసుకొవడానికి అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.  


అయితే గతంలో.. "పి.వి. నరసింహ (కేసు) తీర్పుతో మేము విభేదిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై శాసనసభ్యుడికి మినహాయింపునిచ్చే పి.వి. నరసింహాలోని తీర్పు విస్తృత పరిణామాలను కలిగి ఉంది. దీన్ని రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. 1993 సంవత్సరం జూలై లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పివి నరసింహారావు కేసు వచ్చింది. మైనారిటీ ప్రభుత్వం స్వల్ప తేడాతో మనుగడ సాగించింది - అనుకూలంగా 265 ఓట్లు,  వ్యతిరేకంగా 251 ఓట్లు వచ్చాయి.


అయితే, ఒక సంవత్సరం తర్వాత, ఒక కుంభకోణం బయటపడింది. జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ్యులు పివి నరసింహారావు ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడానికి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. 1998లో, చట్టసభ సభ్యులకు ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని సవరిస్తూ.. కొత్తగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా విచారణకు హజరుకావాల్సిందేనని ధర్మాసనం తెల్చి చెప్పింది.


Read More: Article 370: మరో మైల్ స్టోన్ అందుకున్న ఆర్టికల్ 370 మూవీ..


లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని మేము భావిస్తున్నట్లు తెలిపింది. అవినీతి,  శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులని డీవై చంద్రచూడ్ లతో కూడిన ఏడుగురు జడ్జిల బెంచ్ పై విధంగా పేర్కొంది. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook