Article 370: మరో మైల్ స్టోన్ అందుకున్న ఆర్టికల్ 370 మూవీ..

Artilce 370: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో 'ఆర్టికల్ 370' పేరుతో  సినిమా వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో మైల్‌స్టోన్ అందుకుంది.  

Last Updated : Mar 4, 2024, 10:51 AM IST
Article 370: మరో మైల్ స్టోన్ అందుకున్న ఆర్టికల్ 370 మూవీ..

Artilce 370: 2019లో కేంద్రంలోని నరేంద్ర మోదీ  ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా జమ్మూ కశ్మీర్‌ను దేశం నుంచి వేరు చేస్తోన్న ఆర్టికల్ 370ని ఎంతో సాహోసోపేతంగా 2019 ఆగష్టు 5న పార్లమెంటులో ప్రవేశిపెట్టి తొలిగించింది. అంతేకాదు జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని.. జమ్ము కశ్మీర్‌గా, లద్దాక్‌గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత 31 అక్టోబర్ 2019న సర్ధార్ పటేల్ జయంతి రోజున రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఎప్పుడు ఏదో ఒక గొడవతో సతమతమయ్యే అక్కడ ప్రాంత  ప్రజలు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత  అక్కడి ప్రజల్లో పెను మార్పులు వచ్చాయి.

'యూరీ .. ది సర్జికల్ స్ట్రైక్' మూవీ డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈయనతో పాటు లోకేష్ ధర్, జ్యోతి దేశ్‌పాండే  మూవీ అసిస్టెంట్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. ఆదిత్య జంబాలే ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఆర్టికల్‌ 370 మూవీలో  యామీ గౌతమ్, ప్రియమణితో పాటు అరుణ్ గోవిల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రబరి 23న విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఎలాంటి స్టార్స్ లేకుండా.. కంటెంట్‌ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మును ముందు ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత  కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు జమ్మూ కశ్మీర్‌లో చేస్తోన్న అభివృద్దిని చూస్తూ పక్కనే ఉన్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా POJKను మన దేశంలో విలీనం చేయాలంటూ ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో ఆర్టికల్ 370 పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో తీసుకున్న చర్యలు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అపుడు భద్రతా దళాలు ఎలాంటి చర్యలు తీసుకున్నదనే కాన్సెప్ట్‌తో ఆర్టికల 370 మూవీ తెరకెక్కింది.

Also read: Ycp vs Prashant kishor: ఎన్ని పీకేలొచ్చినా పీకేదేం లేదు, ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్న వైసీపీ నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News