Delhi Traffic Police Challan: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా అనేక మంది బైక్ రైడర్స్ తో పాటు కార్ల యజమానులు ప్రతిరోజూ భారీగా జరిమానాలు విధిస్తున్నారు. సాధారణంగా సినిమాల్లోని ఫన్నీ సన్నివేశాల్లో కొంతమంది ట్రాఫిక్ పోలీస్ పాత్రధారులు డబ్బు కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టడం మనలో చాలా మంది చూసే ఉంటారు. అయితే కొన్నిసార్లు లంచం కోసం ఎదురుచూసే వారు.. విచిత్ర కారణాలతో డబ్బు వసూలు చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ విచిత్రమైన సంఘటన ఢిల్లీలో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెల్మెట్ ధరించలేదని ఓ కారు డ్రైవర్ కు ట్రాఫిక్ పోలీసులు ఈ-ఛలాన్ విధించారు. కారులో హెల్మెట్ అవసరమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే! ఢిల్లీ నగరంలో ఓ వ్యక్తి తన కారులో వెళ్తున్న క్రమంలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నట్లు ఆయనకు ఈ-ఛలాన్ వచ్చింది. కారులో హెల్మెట్ ఎందుకు అని ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. 


అయితే హెల్మెట్ లేదని తన కారుకు ఈ-ఛలాన్ విధించిన నేపథ్యంలో కోపం తెచ్చుకున్న ఆ కారు యజమాని.. ఆ తర్వాత కారులో కూడా హెల్మెట్ ధరించడం మొదలు పెట్టాడు. అయితే తాను ఆరు నెలల క్రితం కారు నడుపుతున్న క్రమంలో హెల్మెట్ లేదని రూ. 100 ఫైన్ ఛలాన్ పొందిన తర్వాత హెల్మెట్ ధరించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.  


Also Read: Kiran Kumar Reddy: ఏపీపై సోనియా గాంధీ ఫోకస్..తదుపరి పీసీసీ చీఫ్‌ ఎవరంటే..!


Also Read: Delhi TRS Bhavan:దేశ రాజధానిలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు షురూ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook